ఎన్టీఆర్ 'ఎమ్మెల్యే' కన్ఫర్మ్

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..సీనియర్ హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాలు తీయాలనే కోరిక తనకు బలంగా ఉందని ఆయన చెప్పారు. తాను తీసిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని 180 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాననీ, ప్రస్తుతం 80 సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందనీ చెప్పారు. తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో హరీష్ శంకర్ ('షాక్ ' ఫేమ్) దర్శకత్వంలో ఉండబోతోందనీ, మేలో సినిమాను సెట్స్ పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామనీ చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్-వి.వి.వినాయక్ కాంబినేషన్ లో కొడాలి నాని 'అదుర్స్' చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత 'ఎమ్మెల్యే' మొదలవుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











