NTR Rajamouli Movie: ఎన్టీఆర్ అభిమానులకు జక్కన్న టెన్షన్.. ఇక వదలడా?
దర్శక ధీరుడు రాజమౌళికి హీరోల కంటే క్రేజ్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. గత ఏడాది రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం.. భారతీయ సినిమాకే గౌరవం తీసుకువచ్చింది. అయితే రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కువగా ఎన్టీఆర్ హీరోగా కనిపించాడు. అయితే రాజమౌళి ప్రస్తుతం మహేశ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తోనే సినిమా చేయనున్నట్లు సినిమా వర్గాల్లో చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
ఎన్టీఆర్ తో ఐదవ సినిమా:2011వ సంవత్సరంలో సింహాద్రి సినిమాతో డైరెక్టర్ గా మారిన జక్కన్న.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు తీస్తూ.. ఇండియన్ సినిమాకే దర్శక ధీరుడు అయిపోయాడు. అయితే రాజమౌళి తీసిన 12 సినిమాల్లో నాలుగు సినిమాలు ఎన్టీఆర్ వే ఉన్నాయి. మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్.. ఇలా ఎన్టీఆర్ రాజమౌళి కాంబోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు వీళ్లు మరోసారి జతకట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రశాంత్ నీల్ సినిమా తర్వాతే..:ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివతో దేవర అనే సినిమాను చేస్తున్నాడు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా హిట్ కొట్టాలనే తపనతో ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ తో జతకట్టనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కాకుండా.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ తో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.

మహేశ్ సినిమా తర్వాతే ఎన్టీఆర్ తో..:మరోవైపు రాజమౌళి .. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుందని సమాచారం. హాలీవుడ్ మూవీని మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈసినిమా కోసం మహేశ్ ను సరికొత్త మేకోవర్ లో చూపెట్టనున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నట్లు సమాాచారం.

మినిమం 5 ఏళ్లు అయినా ఆగాల్సిందే..:మహేశ్ బాబుతో సినిమా పూర్తి అయ్యాక.. ఎన్టీఆర్ తో రాజమౌళి జతకట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ అయ్యాక.. ఈ సినిమా మొదలు కానుందట. ఇక మహేశ్ తో రాజమౌళి తీస్తున్న సినిమా పూర్తి అవ్వాలంటే.. 2 నుంచి మూడేళ్లు అయిన పట్టొచ్చని అంటున్నారు. అయితే రాజమౌళి ఎన్టీఆర్ సినిమా పూర్తి అవ్వాలంటే మినిమం 5 ఏళ్లు అయినా ఆగాల్సిందే. అయితే రాజమౌళి దర్శకత్వంలో సినిమా వచ్చాక.. ఆ హీరో నెక్ట్స్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంది. ఈ సెంటి మెంట్ ఆయన దర్శకత్వంలో వచ్చిన హీరోలందరికీ వర్తించింది. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా అంటే.. నెక్స్ట్ సినిమా పోతుందనే భయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉందనే చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











