స్పెషల్ డాన్స్ లతో కంత్రి
వచ్చే వారం రిలీజుకానున్న 'కంత్రి' సినిమాపై రోజు రోజుకి ఆసక్తి ...అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాలో యన్టీఆర్ తనకే సాధ్యమైన నృత్య భంగిమలతో అభిమానులను అలరించబోతున్నాడు. "వయస్సున్నామి" అనే పాటలో ఒక నిముషం పాటు యన్టీఆర్ ఒంటి కాలిపై నిలబడి డాన్స్ చేస్తాడట. ట్రైలర్స్ కిచ్చిన వాటిలో ఆ బిట్స్ ఇవ్వలేదట. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ సినిమాలో యన్టీఆర్ సరసన హన్సిక, తనీషా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











