బెంగళూరులో 'ఊసరవెల్లి' హంగామా
జూనియర్ ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెల్లి చిత్రం బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 6న బెంగళూరులోని 20 థియేటర్లలో విడుదల చేస్తారు. మెజస్టిక్ సమీపంలోని కపాలి, ఊర్వశి, ఈశ్వరి, తిరుమల, ముకుంద, వెంకటేశ్వర, తులసితో సహ నగరంలోని పీవీఆర్, మల్టీప్లెక్స్‌లలో సినిమాను విడుదల కానుంది. వక్కంతం వంశీ అందించిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రూపొందించిన పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో ఊసరవెల్లి బిగ్గెస్ట్ హిట్ అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దర్శకుడు సురేందర్‌రెడ్డి రూపొందించిన రొమాంటిక్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ఎన్టీఆర్ ఆడియో కార్యక్రమంలో వెల్లడించారు. గురువారం సినిమా విడుదల సందర్భంగా అన్ని థియేటర్ల భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులో కర్ణాటక నందమూరి బాల కృష్ణ అభిమానుల సంఘం నాయకుడు మాణిక్యం ఆధ్వర్యంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పగను హీరో తన శక్తులన్నీ ఒడ్డి తీరుస్తాడని,గజనీలాంటి గమ్మత్తైన పాయింట్ తో ఈ చిత్రం రెడీ అయిందైని వినపడుతోంది. తమన్నా ఈ చిత్రం జ్ఢాపకశక్తిని కోల్పోయే పాత్రను చోస్తోందని తెలుస్తోంది. ఊసరవెల్లి చిత్రం మెమరీలాస్ పాయింట్ ని బేస్ చేసుకుని నడవనుందని విస్వసనీయ సమాచారం. ఈ చిత్రంలో తమన్నా కి మెమరీ లాస్ వస్తుందని, అది ఇంటర్వెల్ కి రివిల్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ఆమెను సేవ్ చేసే ఆమెకు చెందిన పగను తీర్చే ప్రేమికుడుగా ఎమోషన్ కలబోసిన పాత్రలో కనిపిస్తాడు. ఇక గత దసరాకి ఎన్టీఆర్ బృందావనం చిత్రం విడుదలై విజయం సాధించటంతో అదే సెంటిమెంట్ తో ఈ చిత్రాన్ని ఆ సమయానికే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఊసరివిల్లి చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంపై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అశోక్ తర్వాత ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కలిపిచేస్తున్న చిత్రం ఇది. కిక్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన సురేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని మరో బ్లాక్ బస్టర్ గా రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











