'ఊసరవెల్లి' ఆడియో విశేషాలు

By Srikanya

ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఊసరవెల్లి చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆడియో సీడీని ఆవిష్కరించి కీరవాణికి ఇచ్చారు. ఈ వేడుకలో రాజమౌళి, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, హరీష్‌శంకర్, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, డి.సురేష్‌బాబు, ।దిల్ రాజు, కె. అచ్చిరెడ్డి, నల్లమలుపు శ్రీనివాస్, కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, సురేష్‌రెడ్డి, గణేష్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలి టాకీ విడుదలైన ఈ రోజున ఆడియో వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉంది.

ఇన్నేళ్ల చరిత్రలో మా తాతగారు నందమూరి తారక రామారావుగారు, మా నాన్నగారు హరికృష్ణగారు, ఆ తర్వాత మా బాబాయ్ బాలకృష్ణగారు, కళ్యాణ్‌రామ్, తారకరత్న, ఆ తర్వాత నన్ను అభిమానులు ఆదరించి, అంచలంచెలుగా మా ఎదుగులకు కారకులయ్యారు. ఇక ఊసరవెల్లి విషయానికొస్తే... కొత్తదనంతో కూడిన సినిమాలను అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మీరు కోరుకున్న విధంగా కొత్త సినిమా చేశాం. ఇక హిట్ చేయాల్సిన బాధ్యత మీదే. వక్కంతం వంశీ ఈ చిత్రానికి మంచి కథ ఇచ్చాడు. సురేందర్‌రెడ్డి ఈ సినిమాని ఎంత బాగా తీశాడో డబ్బింగ్ చెబుతున్నప్పుడు అర్థం అయ్యింది. ఈ సినిమా సిక్సర్ కాదు... బౌండరీ దాటి, స్టేడియం దాటి బయటపడుతుంది. ఈ చిత్రనిర్మాత ప్రసాద్‌గారు నా కుటుంబ సభ్యుడులాంటివాడు. ఇక దేవిశ్రీప్రసాద్ మంచి ఎనర్జీ ఉన్నవాడు అన్నారు.

'కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X