ఫాల్స్ ప్రెస్టేజీ కి పోకుండా ఎన్టీఆర్
ఎన్టీఆర్ చిత్రం ఊసరవెల్లి రిలీజైన మొదటి రెండు రోజులు కలెక్షన్స్ బాగానే ఉన్నా ఆ తర్వాత ఊహించని విధంగా డ్రాప్ అయ్యిపోయాయి. వారం తిరిగేసరికల్లా ఆ చిత్రం బిలో యావరేజ్ దగ్గర ఆగింది. అయితే ఈ విషయం గ్రహించిన ఎన్టీఆర్ తన నిర్మాతలపై ఒత్తిడి పెంచకండా పబ్లిసిటీ ఖర్చుని తగ్గించమని చెప్పి, అలాగే ధియోటర్స్ ని కూడా ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులే ఉంచమని చెప్పారని సమాచారం. అంతేగాని ఫాల్స్ ప్రెస్టేజి కి పోయి నా సినిమా టాక్ ఎలా ఉన్నా ఇన్ని సెంటర్స్ లో ఆడాల్సిందే అని పట్టు పట్టలేదని మెచ్చుకుంటున్నారు. దాంతో యాభై రోజులు చేరేసరికి ఊసరవెల్లి కేవలం నాలుగే ధియోటర్స్ లో కంటిన్యూగా ఆడింది. అయితే దీనిపై ఎన్టీఆర్ ఏమీ ఫీలవ్వక, జెన్యూన్ గానే ఎన్ని రోజులు ఆడితే అంతలా చేయటం బెస్ట్, అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టి ధియోటర్స్ లో ఆడిచటం అనవసరం అని అభిమానులుకు సైతం చెప్పటం జరిగిందని అందుకే వారు సైతం సైలెంట్ గా ఉన్నారని చెప్పుకుంటున్నారు.
అయితే ఇది మంచి పరిణామమేనని, మిగతా హీరోలు కూడా దీన్న ఆచరిస్తే నిర్మాతలు లాభాలు లేకపోయినా నష్టాలు పాలుకారు అని అంటున్నారు. ఇక సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దమ్ము చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రం పక్కా మసాలా చిత్రంగా చెప్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











