Don't Miss!
- News కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లాంచించ్ డేట్
ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో ఊసరివిల్లి అనే చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తమన్నా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని బివిఎస్ యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక మొదట ఈ చిత్రానికి అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ఫిక్సయ్యారు. నిజానికి ఊసరవిల్లి టైటిల్..మొదట రామ్, జెనీలియా కాంబినేషన్ అనుకున్నప్పుడు అనుకున్నది. ఆ తర్వాత రాణాకీ ఆ టైటిలే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ దగ్గరకి వచ్చేసరికి అదే స్క్రిప్టుకి అతడే ఆమె సైన్యం అని పెడదామని రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ సురేంద్రరెడ్డి...కథ ప్రకారం ఊసరివిల్లి అయితేనే కరెక్టుగా సరిపోతుందని భావించి ఎన్టీఆర్ ని ఒప్పించాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్...బృందావనం చిత్రం విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఇక సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో అశోక్ చిత్రం వచ్చింది. అలాగే సురేంద్రరెడ్డి కిక్ విజయం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. మరో ప్రక్క ఎన్టీఆర్...శక్తి చిత్రం షూటింగ్ లలో బిజీగా పాల్గొంటున్నారు.