అర్జున్ 'జెంటిల్ మెన్' తరహాలో ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'

By Srikanya

అప్పట్లో అర్జున్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన జెంటిల్ మెన్ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులో హైలెట్ గా అర్జున్ రకరకాల గెటప్స్ లో కనిపిస్తూ దొంగతనాలు చేస్తూంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తాజా చిత్రం 'ఊసరవెల్లి" రంగులు మార్చినట్టు కథానుగుణంగా హీరోయిన్ కోసం పలు వేషాల్లో కనిపిస్తాడు ఇందులో ఎన్టీఆర్. అంటే రకరకాల వేషాలు మారుస్తూ ఇందులో ఎన్టీఆర్ ప్రత్యర్ధులు పని పడతాడన్నమాట. జెంటిల్ మెన్ తరహాలో ఇందులో ఎన్టీఆర్ రకరకాల గెటప్స్ లో కనిపిస్తాడన్నమాట. ఇక ఇదే విషయాన్ని దర్శకుడు సురేంద్ర రెడ్డి కన్ఫర్మ్ చేస్తూ...''ఎన్టీఆర్ పాత్ర చిత్రణే ఈ సినిమాకు హైలైట్. 'ఊసరవెల్లి" రంగులు మార్చినట్టు కథానుగుణంగా హీరోయిన్ కోసం పలు వేషాల్లో కనిపిస్తాడు ఇందులో ఎన్టీఆర్.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి వెన్నుముక. ఫస్టాఫ్ రీరికార్డింగ్ పూర్తయింది. అద్భుతమైన రీ-కార్డింగ్ ఇచ్చారాయన. మా 'ఊసరవెల్లి" అక్టోబర్‌లో హల్‌చల్ చేయడం ఖాయం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి వెన్నుముక. ఫస్టాఫ్ రీరికార్డింగ్ పూర్తయింది.
అద్భుతమైన రీ-కార్డింగ్ ఇచ్చారాయన. మా 'ఊసరవెల్లి" అక్టోబర్‌లో హల్‌చల్ చేయడం ఖాయం"" అంటున్నారు.

పరిస్థితులకి తగ్గట్లు రంగులు మార్చుకుంటూ తన లక్ష్యాన్ని సక్రమ మార్గంలో హీరో ఎలా చేరుకున్నాడనేది 'ఊసరవెల్లి' లోని ప్రధానాంశం. ఎవరూ ఊహించని మలుపులతో నడిచే పటిష్టమైన కథ, ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్‌ప్లే ప్రధానాకర్షణలు అంటున్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. ఈ చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ ఆయన ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్ర నిర్మాణంలో ఎన్టీఆర్ ఎంతో సహకారం అందిస్తున్నారు. ఇది ఆయన్ని ఓ కొత్తకోణంలో చూపిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. రొమాన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ అన్నీ మేళవించిన బిగ్ మూవీ. హైదరాబాద్, బ్యాంకాక్, ముంబై, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్‌లలో షూటింగ్ చేశాం. ఈ నెల రెండో వాశరంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నాం. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలిచ్చారు. అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది'' అని చెప్పారు.

'కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X