అంతా పవన్ చేసిందే?: 'అజ్ఞాత'వేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఆ కదలిక వెనుక..
Recommended Video

ఏపీలో చాలా కాలంగా కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య తీవ్ర అగాథం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. విజయవాడలో కుల జాడ్యం ఎక్కువైందని, ముఖ్యంగా కమ్మ-కాపు సామాజిక వర్గాల మధ్య ఐక్యత లేకపోతే ఏపీ అభివృద్ది కష్టసాధ్యమని ఇటీవల పవన్ కల్యాణ్ కూడా వ్యాఖ్యానించారు.
పరిస్థితి చూస్తుంటే.. పవన్ చేసిన ఈ సూచన అక్కడివాళ్లను కదిలించినట్లుగానే కనిపిస్తోంది. రెండు సామాజిక వర్గాల మధ్య వైరం కన్నా మిత్రుత్వమే మంచిదన్న దిశగా వాళ్ల అడుగులు పడుతున్నాయేమో అనిపిస్తోంది. దానికి తాజా ఉదాహరణ ఇది..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ..:
జనవరి 10న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ఒక్క రోజే సమయం ఉండటంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా అప్పుడే మొదలైంది.
ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మాచర్లలోని రామా టాకీస్‌లో కొంతమంది అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆశ్చర్యంగా ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుపున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ఉండటం విశేషం. పవన్, ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుపున 'అజ్ఞాతవాసి'కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

పవన్ ఎఫెక్టేనా?:
గతంలో చాలాసార్లు పవన్ ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్, మహేష్ అభిమానులకు మధ్య గొడవలు జరిగాయి. గోదావరి జిల్లాల్లో ఈ గొడవలు పలుమార్లు ఘర్షణల దాకా వెళ్లాయి.
అలాంటిది ఉన్నట్టుండి ఈ ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే పవన్ ఇటీవల జనసేన మీటింగ్‌లో చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ వల్లే ఈ ఐక్యత సాధ్యపడిందని అంటున్నారు.

పవన్ ఏమన్నారు?:
తెలంగాణ వాళ్లకు ప్రాంతీయ అభిమానం ఎక్కువని, వాళ్లకు కుల జాడ్యం అంతగా లేదని జనసేన సమావేశంలో పవన్ కల్యాణ్ ఇటీవల పేర్కొన్నారు. అదే సమయంలో ఏపీలో మాత్రం కులాల గొడవలు రోజురోజుకు శ్రుతమించతున్నాయని అన్నారు.
ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే.. కొంతమంది 'అభినవ రంగా'.. అంటూ పవన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పవన్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. తాను ఏ ఒక్క కులానికో పరిమితం కాదని, కమ్మ-కాపు కులాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెలకొనాలని ఆశిస్తున్నట్లుగా తెలిపారు.

సయోధ్య కుదిరినట్లేనా?:
పవన్ చొరవ తీసుకుని రెండు కులాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించడం వల్లే ఇప్పుడు ఇరు వర్గాల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం నెలకొంటున్నట్లుగా తెలుస్తోంది. ఫలితంగానే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం 'అజ్ఞాతవాసి' సినిమాకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అనుకోవచ్చు.

పవన్ చొరవ?:
నిజానికి స్టార్ హీరోల మధ్య ఏనాడు ప్రత్యక్ష గొడవలు లేవు. అభిమానులు మాత్రం కులం పేరుతో మరో హీరో అభిమానులతో గొడవ పడ్డ సందర్భాలున్నాయి. ఈ విషయంలో హీరోలెవరూ ప్రత్యక్షంగా కలగజేసుకోలేదు. కానీ పవన్ మాత్రం చొరవ తీసుకున్నారు. ఇరు కులాల మధ్య సామరస్యం నెలకొనాలని ఆశించడమే కాదు.. అదే విషయాన్ని వాళ్లకు సూటిగా చెప్పగలిగారు.


Click it and Unblock the Notifications











