పుట్టినరోజు కానుక: ఎన్టీఆర్ మరో చిత్రం ప్రకటన!

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో అగ్రనిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ భారీ చిత్రం నిర్మిస్తున్నారు. మే 20న యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రాన్ని ఎనౌన్స్ చేసారు బండ్ల గణేష్. సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తేనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రం గురించి నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'మా సంస్థ నిర్మించిన 'బాద్ షా' బిగ్గెస్ట్ హిట్ అయి ఎన్టీఆర్‌గారి కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. 'బాద్ షా' జరుగుతున్నపుడే మళ్లీ మా బేనర్‌కి సినిమా చేస్తానని అన్నారు ఎన్టీఆర్. ఆ మాట ప్రకారం ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని చేసే అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది' అన్నారు.

ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు...

బండ్ల గణేష్

బండ్ల గణేష్

పూరి జగన్నాథ్ సొంత బ్రదర్ లాంటి వారు. ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ భారీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీయాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరబోతోందని బండ్ల గణేష్ తెలిపారు.

వక్కతవం వంశీ

వక్కతవం వంశీ

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కిక్, ఎవడు, రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కతం వంశీ అద్భుతమైన సబ్జెక్టు అందించారు.

బ్లాక్ బస్టరే..

బ్లాక్ బస్టరే..

ఈ చిత్రం మా బేనర్లో డెఫినెట్‌గా ఇది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలూ త్వరలోనే తెలియజేస్తానని బండ్ల గణేష్ తెలిపారు. ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

రభస

రభస

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘రభస' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X