twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్-పూరి మూవీ: ‘షంషేర్’ టైటిలే ఫైనలా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, డైరక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో నిర్మాత బండ్ల గణే ష్ నిర్మిస్తున్న చిత్రానికి ఇప్పటికే రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఏది ఫైనల్ కాలేదు. టెంపర్ అన్న టైటిల్ బయటకు వచ్చింది. తర్వాత నేనోరకం అన్నారు. తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ‘షంషేర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

    టైటిల్ ఖరారైన తర్వాత సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పోలీసాఫీసర్ పాత్రలో కనపడబోతున్నారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ బేగంపేటలో పోలీస్ స్టేషన్ సెట్ వేసారు. దీని కోసం నిర్మాత బండ్ల గణేష్ రూ. 27 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

    NTR, Puri film titled ‘Shamsher’?

    యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.

    కెనిడయన్ మోడల్ అయిన నోరా ఫటేహి ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    According to the latest rumours, Jr NTR, Puri Jagannath next movie titled ‘Shamsher’. Sources also add that an official announcement will be made soon and film’s first look. will be released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X