twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతికే వస్తున్నాడు..సూపర్ హిట్టే

    By Srikanya
    |

    హైదరాబాద్ : సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ. అందుకే సినిమావారు తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తూంటారు. తాజాగా ఎన్టీఆర్ సైతం సంక్రాంతికి సిద్దమవుతున్నారు. ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం కంటిన్యూ షెడ్యూల్ తో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయనున్నారు. పరమేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ నిర్మించనున్నారు. సంక్రాంతికి విడుదల ప్లాన్ చేయటంతో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మతంతో అభిమానులు ఉన్నారు.

    ఈ చిత్రంలో కాజల్‌ని హీరోయిన్ గా ఎంచుకొన్నారు. ఎన్టీఆర్‌ శక్తివంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తారు. సినిమా చిత్రీకరణ పూరి జగన్నాథ్‌ శైలికి భిన్నంగా సాగనుందని సమాచారం. సాధారణంగా పూరి జగన్నాథ్‌ శరవేగంగా సినిమాల్ని పూర్తి చేస్తారు. ఈ చిత్రానికి మాత్రం వంద రోజులు షెడ్యూల్‌ వేశారట. డిసెంబరుకల్లా పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా.. జనవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.

    NTR - Puri Jagannadh film to have a Sankranthi release

    పూరీ జగన్నాథ్ కేవలం పది రోజుల్లో వండి వడ్డించే కథలపై ఎన్టీఆర్ కి నమ్మకం లేకే పూరీ జగన్నాథ్ బయిట కథని తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. పూరీ జగన్నాథ్ నాలుగైదు కథలు వినిపించాడని, ఏ కథా ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేయలేకపోయిందని, అప్పుడు వంశీ కథతో చేయమని ఎన్టీఆర్ చెప్పారని తెలుస్తోంది. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేయటం ప్రధానం అనుకున్న పూరీ ఇమ్మీడియట్ గా కథ విని, డైలాగ్స్ రాసుకోవటానికి సిద్దమయ్యారు. ఇది మంచి పరిణామం అంటున్నారు. ఖచ్చితంగా ఈ సారి కమర్షియల్ బ్లాక్ బస్టర్ వచ్చే అవకాసం ఉందంటున్నారు.

    అలాగే టైటిల్ సైతం ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా 'కుమ్మేస్తా' అని పెట్టినట్లు సమాచారం. ఇక పూరీ జగన్నాథ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ చిత్రం మరో 'ఆంధ్రావాలా' అవుతుందా లేక నిజంగానే కలెక్షన్స్ కుమ్ముతుందా అనేది తేలాలి.

    English summary
    Jr Ntr, purijagan film release scheduled for Jan 9 2015 , Regular Shooting From July.Kajal Agarwal again pairing up with Jr NTR for this flick.Vakkantham Vamsi provided story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X