కాజల్, కోవై సరళ లతో కలిసి ఎన్టీఆర్ అల్లరి
హైదరాబాద్ : ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి స్ధాయి పోలీస్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పోలీస్ స్టేషన్ సెట్‌లో ఎన్టీఆర్, కాజల్, కోవై సరళ మిగతా నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సెట్ కోసమే కేవలం 27 లక్షలు వరకూ ఖర్చు పెట్టినట్లు సమాచారం.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ... అందరిలా ఆ పోలీసూ ఖాకీనే కడతాడు. లాఠీనే పడతాడు. అతని తీరు ఓ రకం. మాటలు, చేతలు అన్నీ ప్రత్యేకం. తన పోలీసు స్టేషన్‌కి వచ్చిన ఓ అందమైన అమ్మాయితో కలసి ఎలాంటి సందడి చేశాడో తెరపైనే చూడాలంటున్నారు బండ్ల గణేష్. ఆయన నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్, కాజల్ జంటగా నటిస్తున్న ఆ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

అలాగే ... ''ఎన్టీఆర్ పూర్తిస్థాయి పోలీసు పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. పూరి శైలి మాస్ అంశాలు ఉంటాయి. వక్కంతం వంశీ తయారు చేసిన కథలో కొత్తదనం ఉంది. ఎన్టీఆర్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అని చెప్పారు.
ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ప్రకాష్‌రాజ్, మధురిమ, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్


Click it and Unblock the Notifications











