పూరి జగన్నాథ్ స్టోరీ ఓకే చేసిన జూ ఎన్టీఆర్!

By Bojja Kumar

హైదరాబాద్: 'ఆంధ్రావాలా' చిత్రం తర్వాత దాదాపు పదేళ్ల గ్యాప్ తీసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్‌లు త్వరలో మరో సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూ ఎన్టీఆర్ పూరి చెప్పిన స్టోరీ లైన్‌కు ఓకే చెప్పేసాడు. స్క్రిప్టు వర్కులో భాగంగా ఇటీవల బ్యాంకాక్ వెళ్లి వచ్చిన పూరి జగన్నాథ్.....దాన్ని జూ ఎన్టీఆర్‌కు వినిపించాడని తెలుస్తోంది.

స్క్రిప్టు వర్క్ పర్‌ఫెక్టుగా ఉందని జూ ఎన్టీఆర్ పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఓ బడా సినీ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతున్నాయి. నిర్మాతలు ఖరారైన తర్వాత సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

NTR, Puri teaming up for a new project

యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టెనర్‌గా సాగే ఈచిత్రం గతంలో వచ్చిన పూరి జగన్నాథ్ మార్కు సినిమాలకు భిన్నంగా సాగుతుందట. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఈచిత్రానికి హీరోయిన్ ఎవరు? ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

అన్నీ ఒకే అయితే మే 2న సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు జూ ఎన్టీఆర్ పుట్టినరోజు. 'ఆంధ్రావాలా' తరవాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. మధ్యలో బండ్ల గణేష్‌ ఈ కాంబినేషన్‌ కుదర్చడానికి ప్రయత్నించాడు. కానీ... వీలు కాలేదు. ఈ సారి మాత్రం ఎన్టీఆర్‌ - పూరి జత కట్టడం ఖాయంగానే కనిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X