twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టెంపర్’: ఇదొక్కటి చాలు క్యూలు కట్టడానికి (పోస్టర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'.ఈ చిత్రం టీజర్, పోస్టర్ అంటూ రోజుకొకటి దింపి సినిమాపై విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు పూరీ జగన్నాథ్. తాజాగా ఆయన మరో పోస్టర్ ని వదిలారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు...ఇదొక్కటి చాలు...థియోటర్స్ దగ్గర జనం క్యూలు కట్టడానికి అంటూ సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తున్నారు.

    అలాగే...ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదపడితే దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

    NTR Raises Temper: New Look poster

    నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...మా బేనర్లో నిర్మిస్తున్న ‘టెంపర్' చిత్రానికి సంబంధించిన టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదల చేసాం. రెస్పాన్స్ బాగుంది. ఎన్టీఆర్ లుక్, స్టైల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇటీవల విడుదలైన సిక్స్ ప్యాక్ లుక్ కి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇపుడు రిలీజైన టీజర్‌కి దాన్ని మించిన రెస్పాన్స్ వస్తోంది.

    ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా, ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా బేనర్ ప్రతిష్టను మరింత పెంచే సినిమా అవుతుంది. అలాగే ఎన్టీఆర్ గారి కెరీర్లో, పూరి జగన్నాథ్ గారి కెరీర్లో, నా కెరీర్లో ‘టెంపర్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ నెల 20 వరకు జరిగే షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. మరో పక్క పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాం' అన్నారు.

    ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Jr NTR, Kajal starrer Temper is going to release on February 2015.It's new poster released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X