శరవేగంగా ఎన్టీఆర్ రాఖీ, డిసెంబర్లో విడుదల
ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రాఖీ సినిమా షూటింగ్, శరవేగంగా నిరంతరాయంగా జరుగుతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై డా.కెఎల్ నారాయణ, ఎస్ గోపాలరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం లాలాపేట (సికింద్రాబాద్) రైల్వే కాలనీలో వేసిన సెట్లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. సెట్స్ మీద ఎన్టీఆర్ చిరు గ డ్డం లేకుండా, నీట్‌గా స్లిమ్‌గా కన్పించారు. ఈ సినిమాలో కమ్మర్షియల్ ఎలిమెంట్స్ అనీ ఉన్నా అవి కృష్ణవంశీ స్టైల్‌లో సృజనాత్మకంగా ఉంటాయి. అక్టోబర్‌లో షూటింగ్ పూర్తి చేసి, డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కెఎల్ నారాయణ, ఎస్ గోపాలరెడ్డి సంయుక్తంగా గతంలో క్షణక్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం నిన్నే ఇష్టపడ్డాను వంటి విజవంతమైన సినిమాలను నిర్మించారు.


Click it and Unblock the Notifications