For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాగోలేకుంటే అంతే, ‘శ్రీనివాస కళ్యాణం’ కథ విని ఎన్టీఆర్‌ ఫోన్ చేయలేదు: దిల్ రాజు

  By Bojja Kumar
  |

  నితిన్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' ఇటీవల విడుదలై తొలి రోజు కాస్త మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. అయితే మళ్లీ పుంజుకుని మంచి వసూళ్లు సాధిస్తోందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. సినిమా గురువారం విడుదల కావడం, డివైడ్ టాక్ రావడంతో వసూళ్లు సరిగా రాలేదని, శుక్రవారం కలెక్షన్ 50శాతం డౌన్ అవ్వడంతో అంతా కాస్త కంగారు పడ్డారు. కానీ నేను ముందే ఊహించాను... శనివారం మల్లీ పుంజుకుంది అంటూ బాక్సాఫీసు వద్ద సినిమా అసలు పరిస్థితిని నిర్మొహమాటంగా చెప్పేశారు దిల్ రాజు. వాస్తవానికి ఈ సినిమా మొదట ఎన్టీఆర్‌తో అనుకున్న విషయం కూడా ఆయన చెప్పారు.

  Srinivasa kalyanam Team Success Meet @KLM Fashion Mall
  ఇలాంటి టైటిల్‌తో యూత్ రారు

  ఇలాంటి టైటిల్‌తో యూత్ రారు

  ‘శ్రీనివాస కళ్యాణం' అనే టైటిల్ ఉన్నపుడు యూత్ ఎవరు మొదటి రోజు థియేటర్లకు పరుగెత్తుకుంటూ రారు అని నాకు ముందే తెలుసు. రాలేదు కూడా... మ్యాట్నీకి, ఫస్ట్ షోకు రావాల్సిన ఫ్యామిలీ ప్రేక్షకులు వచ్చారు అని దిల్ రాజు తెలిపారు.

  బాగోలేని సినిమాను ఎవరూ లేపలేరు

  బాగోలేని సినిమాను ఎవరూ లేపలేరు

  సినిమా శుక్రవారం రిలీజ్ చేసి ఉంటే ఆ డ్రాప్ వచ్చేది కాదు. గురువారం రిలీజ్ చేశాం కాబట్టి శుక్రవారం కలెక్షన్ డ్రాప్ అయింది. 50 శాతం కలెక్షన్స్ పడిపోయిందనే టాక్ ఎక్కువ స్ప్రెడ్ అయింది. కానీ నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. బాగా లేని సినిమా పడిపోయిందంటే లేవదు. షో బై షో వసూళ్లు పడిపోతాయి. అవి స్టార్ హీరోల సినిమాలైనా అంతే. అజ్ఞాతవాసి, స్పైడర్ చిత్రాలను నేను డిస్ట్రిబ్యూట్ చేశాను కాబట్టి నాకు తెలుసు. కానీ శ్రీనివాస కళ్యాణం లాంటి మంచి సినిమా మళ్లీ పుంజుకుంటుందని నాకు ముందే తెలుసు... మేము అనుకున్నట్లే శనివారం నుండి వసూళ్లు ఊపందుకున్నాయి అని దిల్ రాజు తెలిపారు.

  సక్సెస్ వస్తే కోట్లు పట్టుకుని వస్తారు

  సక్సెస్ వస్తే కోట్లు పట్టుకుని వస్తారు

  గతేడాది శతమానం భవతి తర్వాత సతీష్‌ను ఏం సినిమా చేయబోతున్నావు అని అడిగాను. ఇలా అనుకుంటున్నాను అని చెప్పడంతో... ఎవరితో సినిమా చేసినా మంచి సినిమా చేయమని చెప్పాను. అప్పటికి మా బేనర్లో ‘శ్రీనివాస కళ్యాణం' చేద్దామని అనుకోలేదు. శతమానం భవతి లాంటి సినిమా తీసిన తర్వాత అతడి వద్దకు చాలా మంది నిర్మాతలు వచ్చారు. ఒకతను కోటి రూపాయల అడ్వాన్స్‌తో వచ్చాడు. ఒక సక్సెస్ తర్వాత ఇలాంటివి మామూలే. అపుడు ఒకటే చెప్పాను. మనీ కావాలా? మంచి సినిమా కావాలా? నువ్వు డిసైడ్ చేసుకోమని చెప్పాను. సక్సెస్ క్యాష్ చేసుకునే పద్దతి ఒకటి, సక్సెస్‌ను కంటిన్యూ చేయడం ఒక పద్దతి అని చెప్పాను. తర్వాత ఆలోచించుకుని శ్రీనివాస కళ్యాణం కథతో వచ్చాడు అని దిల్ రాజు గుర్తు చేసుకున్నాడు.

  నితిన్ కంటే ముందు తారక్, చరణ్‌లకు కథ చెప్పాం

  నితిన్ కంటే ముందు తారక్, చరణ్‌లకు కథ చెప్పాం

  నితిన్ కంటే ముందు తారక్, చరణ్ అనుకున్నాం. మేము ఏ సినిమా మొదలు పెట్టినా ముందుగా ముగ్గురు హీరోలను అనుకుంటాం. ఎందుకంటే ఏ హీరో దొరుకుతాడో తెలియదు. మొదట ఎన్టీఆర్ అనుకున్నాం. ఇలా అనుకోవడమే ఆలస్యం సతీష్ మర్నాడు ఒక డిజైన్ కూడా రెడీ చేసుకుని తీసుకొచ్చాడు. తారక్‌కు కథ విని బావుందన్నాడు. కానీ నాకు కొంత టైమ్ కావాలన్నాడు. వెనక్కి వచ్చిన తర్వాత మాకే డౌట్ వచ్చింది.

   తారక్ మళ్లీ ఫోన్ చేయలేదు

  తారక్ మళ్లీ ఫోన్ చేయలేదు

  స్టార్ హీరోలతో వెళ్లినపుడు వారి ఇమేజ్ కూడా క్యారీ అవ్వాలి. తారక్ లాంటి హీరోతో చేయాలన్నపుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూడాలి. అందుకే తారక్‌ను మళ్లీ టచ్ చేయలేదు. తను కూడా ఫోన్ చేయలేదు. తర్వాత చరణ్ తో కూడా అనుకున్నాం. కానీ ఈ లోపు నితిన్ గుర్తొచ్చాడు. నితిన్‌ను ఎప్పటి నుండో అనుకుంటున్నాం. మధ్యలో ఒక నాలుగైదు స్క్రిప్టులు విన్నాడు. కానీ ఏది కూడా మెటీరియలైజ్ కాలేదు. శ్రీనివాస కళ్యాణం కథ వినగానే సూపర్ ఉంది, నేను ఈ సినిమా చేస్తున్నా అని ముందుకొచ్చినట్లు దిల్ రాజు తెలిపారు.

  English summary
  "NTR & Ram Charan Heard Srinivasa Kalyanam Story Before Nithin" Dil Raju said. Srinivasa Kalyanam' starring Nithiin and Raashi Khanna, Nandita Swetha, Directed by Sathish Vegeshna and Produced by Dil Raju.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X