రాజమౌళి దిమ్మతిరిగే ప్లానింగ్.. బాహుబలి తరహాలో ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్..

By Rajababu

Recommended Video

రాజమౌళి దిమ్మతిరిగే ప్లానింగ్.. బాహుబలి తరహాలో మల్టీస్టారర్..!

బాహుబలి సంచలన విజయం తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్‌తో దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగటైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ బాక్సర్లుగా నటిస్తున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. అదేమిటంటే..

 పక్కాగా బాహుబలి ప్లానింగ్

పక్కాగా బాహుబలి ప్లానింగ్

బాహుబలి లాంటి ప్రాజెక్ట్‌ను దాదాపు నాలుగు సంవత్సరాలు ఏకధాటిగా షూట్ చేశారు. తొలుత బాహుబలి ఒకేపార్ట్‌గా తీయాలని మొదలుపెట్టిన జక్కన్న చివరకు దానిని రెండు భాగాలు విడగొట్టారు. అందుకు కారణం కంటెంట్. ఆ క్రమంలో పక్కాగా ప్లానింగ్ చేసి రెండు భాగాలను అద్భుతంగా తెరకెక్కించారు.

తడబాటు లేకుండా జక్కన్న

తడబాటు లేకుండా జక్కన్న

రాజమౌళి ప్లానింగ్‌ను చూసి సినీ దిగ్గజాలే ముక్కు వేలేసుకొన్న పరిస్థితి. ఎలాంటి తడబాటు లేకుండా ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను సునాయాసంగా ముందుకు తీసుకెళ్లాడు. అంతటి చక్కటి ప్లానింగ్ అనుభవం ఉన్న రాజమౌళి ఇప్పుడు మల్టీస్టార్ ప్రాజెక్ట్‌ను అదే విధంగా ముందుకు తీసుకెళ్లున్నాడట.

 మూడు దశలలో చిత్రీకరణ

మూడు దశలలో చిత్రీకరణ

ఎన్టీఆర్, రాంచరణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలకు అనుగుణంగా రాజమౌళి తన ప్లానింగ్‌ను మొదలుపెట్టారట. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పక్కాగా పూర్తి చేసుకొన్నారనేది ఇన్‌సైడ్ టాక్. ఈ చిత్రాన్ని మూడు దశలలో పూర్తి చేయాలనే ప్లానింగ్‌తో రాజమౌళి ముందుకెళ్తున్నారు.

 త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్

త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టి ఈ సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రం పవన్ కల్యాన్ నటిస్తున్న అజ్క్షాతవాసి చిత్రం రిలీజ్ తర్వాత పట్టాలెక్కనున్నది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కమిట్‌మెంట్స్ దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ఓ ప్లానింగ్ సిద్దం చేశారు.

తొలుత ఎన్టీఆర్‌తో షూట్

తొలుత ఎన్టీఆర్‌తో షూట్

తొలుత ఎన్టీఆర్‌తో సన్నివేశాలను, ఆ కథను షూట్ చేస్తారట. ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్లును ముందుగా తెరకెక్కించి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్లాన్ చేస్తున్నారట. దీంతో చిత్ర షూటింగ్ సంబంధించిన తొలి దశ పూర్తవుతుంది.

 రాంచరణ్‌తో చిత్రీకరణ

రాంచరణ్‌తో చిత్రీకరణ

ఆ తర్వాత రాంచరణ్‌పై నడిచే కథను తెరకెక్కిస్తారు. రాంచరణ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించి రెండో దశను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య నడిచే సీన్లను షూట్ చేసి మూడో దశను పూర్తి చేస్తారట. దీంతో చిత్రానికి చెందిన టాకీ పార్ట్ పూర్తవుతుంది.

 నిర్మాతగా డీవీవీ దానయ్య

నిర్మాతగా డీవీవీ దానయ్య

డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై రూపొందే ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు. బాక్సర్లు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X