»   » ‘ఆర్ఆర్ఆర్’....రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ అనౌన్స్‌మెంట్‌ అదుర్స్

‘ఆర్ఆర్ఆర్’....రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ అనౌన్స్‌మెంట్‌ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘ఆర్ఆర్ఆర్’....రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ అనౌన్స్‌మెంట్‌ అదుర్స్

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడం ద్వారా ఉత్కంఠకు తెరదించారు దర్శక నిర్మాతలు. అసలు ఎవరూ ఊహించని విధంగా వినూత్నంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

ఆర్ఆర్ఆర్ అనేది టైటిల్ కాదు

‘ఆర్ఆర్ఆర్' పేరుతో ఓ టీజర్ విడుదల చేశారు. అయితే ఇది టైటిల్ కాదని.... రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్ చరణ్ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ముగ్గురి పేర్లు వచ్చేలా ఇలా అనౌన్స్ చేశారట. అఫీషియల్ టైటిల్ ఫైనల్ అయ్యే వరకు ఉపయోగించే తాత్కాలిక పిలుపు మాత్రమే అని చిత్ర యూనిట్ తెలిపారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం

దర్శకుడు రాజమౌళి టాలీవుడ్లో టాప్ రేంజి డైరెక్టర్.... ఎన్టీఆర్, రామ్ చరణ్ టాప్ హీరోలు. ఈ ముగ్గురి కలయిక అంటే భారీ బడ్జెట్ తప్పనిసరి. డివివి ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

 గ్రాఫిక్స్ లేవు... స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్

గ్రాఫిక్స్ లేవు... స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్

రాజమౌళి గత చిత్రాలు తీసుకుంటే ఈగ, బాహుబలి, బాహుబలి2 చిత్రాలు భారీగా గ్రాఫిక్స్ వర్క్‌తో కూడిన సినిమాలు. అయితే ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని గ్రాఫిక్స్ జోలికి పోకుండా చిత్రీకరించాలని నిర్ణించారు రాజమౌళి. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి

ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి

ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. సినిమా వర్క్ షాపులో భాగంగా ఇటీవలే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి యూఎస్ఏకు వెళుతూ ఎయిర్‌పోర్టులో కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

విజయేంద్రప్రసాద్ కథ

విజయేంద్రప్రసాద్ కథ

ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు ఏమీ బయటకు రాలేదు. అయితే కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు ఫైనల్ స్టేజీలో ఉందని సమాచారం.

 తెలుగు నుండి టాప్ యాక్టర్ విలన్‌గా

తెలుగు నుండి టాప్ యాక్టర్ విలన్‌గా

రాజమౌళి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం తెలుగు నుండి మరో టాప్ యాక్టర్‌ను తీసుకోబోతున్నారని, ఆయన ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. అయితే అతడు ఎవరు? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. నటీనటుల విషయంలో రాజమౌళి ఏ మాత్రం రాజీపడనే విషయం తెలిసిందే. చూద్దా మరి ఆయన ఇంకా ఎవరెవరిని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తారో?

English summary
RRR movie Announcemened. Starring NTR, Ram Charan. An SS Rajamouli Film. A DVV Entertainment Production.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X