ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే పోయారు: శ్రీదేవి మరణంపై జూ ఎన్టీఆర్, రవితేజ
ప్రముఖ నటి శ్రీదేవి మరణంతో ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం షాకైంది. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఆమె తీవ్రమైన గుండె పోటకు గురై అక్కడికక్కడే కన్నుమూశారు. శ్రీదేవి మరణ వార్త వినగానే యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, రవితేజ ఎమోషనల్‌గా స్పందించారు.
ఎన్టీఆర్ ట్వీట్
‘‘ఆమె వచ్చింది.. ఆమె చూసింది. ఆమె అందరినీ తన వశం చేసుకుంది. తను ఎక్కడినుంచైతే వచ్చిందో ఆ స్వర్గానికే తిరిగి వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాలి. ఆమె లేని లోటు పూడ్చలేనిది'' అంటూ జూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Recommended Video


ఎన్టీఆర్ ట్వీటుకు వర్మ రిప్లై
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్‌కు వర్మ వెంటనే స్పందించారు. ‘ఎప్పటికీ మరచిపోలేని అత్యంత అందమైన సోల్' అని వర్మ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

రవితేజ ట్వీట్
శ్రీదేవి మరణంపై ప్రముఖ హీరో రవితేజ విషాదం వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆమె మరణించిందన్న వార్తను తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఆమె లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని ఆయన చెప్పారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

శ్రీదేవి
దుబాయిలో బాలీవుడ్ నటుడి వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీదేవి తన కెరీర్‌లో 260 సినిమాలు చేశారు. హిందీలో 'మామ్' చిత్రంలో నటించారు.


Click it and Unblock the Notifications











