»   » హరిద్వార్ చేరుకున్న జూ ఎన్టీఆర్..డిటేల్స్

హరిద్వార్ చేరుకున్న జూ ఎన్టీఆర్..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం శక్తి షూటింగ్ బిజీలో ఉన్న జూ ఎన్టీఆర్ నిన్న రాత్రి లేట్ అవర్స్ లో హరిద్వార్ చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. మనాలిలో షూటింగ్ పూర్తి చేసుకుని ఇక్కడకు చేరుకున్నారు. ఈ రోజు పూర్తిగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి (మంగళవారం)షూటింగ్ ప్రారంభిస్తారు. రెండు రోజులు పాటు హరిద్వార్ లో షూటింగ్ చేసుకుని హైదరాబాద్ ఆగస్టు 5న చేరుకుంటారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఈజిప్టు వనితగా ఓ కీలకపాత్ర పోషిస్తోంది.

తెలుగు చలనచిత్ర చరిత్రలో హయ్యస్ట్ నెంబరాఫ్ లొకేషన్స్‌లో, హయ్యస్ట్ బడ్జెట్ ‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ లాండ్ మార్క్ ఫిలిం అవుతుంది' అన్నారు. ఈ చిత్రానికి మాటలు:సత్యానంద్, రచనాసహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సమర్పణ: సి.ధర్మరాజు, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌రమేష్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu