ఆడవాళ్ల మీద అకృత్యాలు, ఎందుకు మనం మగాళ్లుగా పుట్టాం: జూ ఎన్టీఆర్
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహానటి సావిత్రి గురించి, చిత్ర బృందం గురించి మాట్లాడటంతో పాటు చివర్లో మహిళల గురించి మాట్లాడారు. ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి ప్రస్తావించారు. పలానా సంఘటన అని ఆయన ఏమీ గుర్తు చేయలేదు కానీ... ఎన్టీఆర్ మాటలను ఈ మధ్య కాలంలో జరిగిన అనేక సంఘటనలకు అన్వయిస్తున్నారు అభిమానులు.

ఆడవాళ్ల మీద ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి
సావిత్రి ఆడియో వేడుకలో తన ప్రసంగం ముగించే ముందు ఓ చిన్న విషయం చెబుదామనుకుంటున్నాను అంటూ ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు ఎన్టీఆర్. ఈ మధ్య ఆడవాళ్ల మీద ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎందుకు మనం మగాళ్లుగా పుట్టామని మీరు అనుకోక పోతే....
ఒక్క సారి సావిత్రిగారి మహానటి చిత్రం చూసిన తర్వాత ఎందుకు మనం మగాళ్లుగా పుట్టామని మీరు అనుకోక పోతే.... ది ట్రూ లేడీ సూపర్ స్టార్.... అపుడు తెలుస్తుంది మీకు ఒక ఆడదాని బలం ఏమిటో? ఆడవాళ్లు తలుచుకుంటే ఏమి సాధించగలుగుతారో తెలుస్తుంది. ఈ చిత్రం చూసి ఇప్పటికైనా ఆడవారిని గౌరవిస్తారని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ తెలిపారు.

కాస్టింగ్ కౌచ్ గురించేనా?
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. వారిని ఉద్దేశించి ఎన్టీఆర్ ఈ కామెంట్స్ చేశారా? ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీని పరోక్షంగా ఆయన ప్రస్తావించారా? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

కథువా, ఉన్నావా ఘటనలు
ఈ మధ్య కాలంలో కథువా, ఉన్నావా సంఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశాయి. దేశంలో ఆడవారిపై జరుగుతున్న ఇలాంటి దారుణాల గురించి ఎన్టీఆర్ పరోక్షంగా ప్రస్తావించారని, మహిళలను గౌరవించాలని సూచించారని చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











