నేను రెడీ..ఎన్టీఆర్
ఆమధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన యంగ్ హీరో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగులో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సంగతిని ఎన్టీఆర్ స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఈ నెల 20 నుంచి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగులో పాల్గొనబోతున్నా. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై కొడాలి నాని, వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకధాటిగా మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం నా ధ్యాసంతా ఈ చిత్రం మీదే అని చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కారణంగా త్వరలో అమెరికాలో జరుగనున్న తానా సభల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదని సమాచారం. ఈ చిత్రం అనంతరం నల్లమలుపు బుజ్జి నిర్మాతగా హరీష్ శంకర్ ఎమ్మెల్యే చిత్రంలో చేయనున్నారు. అనంతరం దిల్ రాజు నిర్మిస్తూ మున్నా దర్శకుడు పైడిపల్లి వంశి చిత్రం బృందావనంలో చేయనున్నారు.
jr ntr vinyak adurs road accident media kodali nani america harish shankar mla దిల్ రాజు పైడిపల్లి వంశి బృందావనం రోడ్డు ప్రమాదం వినాయక్ వైష్ణవి ఆర్ట్స్


Click it and Unblock the Notifications