నడిపించింది ఆయనే.. ఇలాంటి సమయంలో నాకు బలాన్ని ఇచ్చారు.. జూ.ఎన్టీఆర్
Recommended Video

అరవింద సమేత చిత్ర యూనిట్ లో సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన అరవింద సమేత చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన నటనతో అదరగొట్టాడు. దసరా సెలవులు ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద అరవింద సమేత చిత్రం ఘన విజయం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అరవింద సమేత విజయంపై ఎన్టీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

నడిపించింది ఆయనే
అరవింద సమేత చిత్రానికి వస్తున్న అద్భుతమైన స్పందన సంతోషాన్ని కలిగిస్తోంది. మీ ప్రేమకు కృతజ్ఞతలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకుండా ఇంత భారీ విజయం సాధ్యం కాదు. ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ అంకిత భావంతో పనిచేశారు. మమ్మల్ని నడిపించింది ఆయనే అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు.

సినిమాని భుజాలపై మోశారు
ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. అరవింద సమేత నిర్మాతలు రాధాకృష్ణ, నాగ వంశీ, హీరోయిన్ పూజ హెగ్దే, విలన్ గా నటించిన జగపతి బాబు, సంగీత దర్శకుడు తమన్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లకు ఎన్టీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ చిత్రాన్ని పని చేసిన ప్రతి ఒక్కరు అరవింద సమేతని వారి భుజాలపై మోసారని ఎన్టీఆర్ అభినందించాడు.

ఇలాంటి సమయంలో నాకు బలం
అభిమానులందరికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎన్టీఆర్.. ఇలాంటి సమయంలో నాకు బలాన్నిచ్చింది మీరే అంటూ తన తండ్రి మరణ విషాదాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఫ్యాక్షన్ కథలో
అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ దర్శకత్వం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. త్రివిక్రమ్ రూపొందించిన ఫ్యాక్షన్ కథకు ఎన్టీఆర్ తన నటనా ప్రతిభతో 100 శాతం న్యాయం చేశాడని అంటున్నారు. ఫ్యాక్షన్ కథని త్రివిక్రమ్ ఎమోషనల్ గా నడిపించిన విధానం అద్భుతం అని అంటున్నారు. తొలి రోజే అరవింద సమేత చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో దసరా సెలవుల్లో కలెక్షన్ల సునామీకి రంగం సిద్ధం అయింది.


Click it and Unblock the Notifications











