భరత్ అనే నేనుపై మహేష్ తమ్ముడు ఎన్టీఆర్ స్పందన.. అంత సులభం కాదన్న తారక్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ తో ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లోనే ఇటు నటన పరంగా, వసూళ్ల పరంగా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే అభిమానుల నుంచి స్పందన ఏవిధంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబుకు, దర్శకుడు కొరటాల శివకు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

యంగ్ సీఎంగా మహేష్ లుక్స్, నటన చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. భరత్ అనే నేను చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్రం పెర్ఫామెన్స్ పరంగా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని మహేష్ బాబు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్యఅతిథి గా హాజరై మహేష్ ని అన్న అని సంభోదించాడు. మహేష్ కూడా తమ్ముడు తారక్ అని పిలిచాడు.

NTR response after watching Bharat Ane Nenu movie

భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించడం విశేషం. కమర్షియల్ అంశాలని, సందేశాన్ని కలిపి చెప్పడం అంత సులువైన విషయం కాదని ఎన్టీఆర్ అభిప్రాయ పడ్డారు. కానీ దర్శకుడు కొరటాల ఆ పనిని అద్భుతంగా భరత్ అనే నేను చిత్రం ద్వారా చేసి చూపించారని ప్రశంసించారు. ఇక మహేష్ బాబు నటన ఇరగదీశారని ఎన్టీఆర్ కొనియాడారు. భరత్ అనే నేను చిత్ర యూనిట్ మొత్తానికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X