ఈ రోజు నుంచి పదిరోజుల పాటు..ఎన్టీఆర్ ‘బాద్ షా’
హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రం ఈ రోజు (సెప్టెంబర్ 17)నుంచే యాక్షన్ లోకి దిగనుంది. పదిరోజుల పాటు హైదరాబాద్ లోని వేర్వేరు ప్రదేశాల్లో స్పెషల్ గా వేసిన సెట్స్ లో యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించనున్నారు. నవదీప్ ఈ ఎపిసోడ్స్ లో పాల్గొంటారని తెలిసింది. ఆ తర్వాత మరికొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్లనుంది. ఈ ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్,మరికొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ పాల్గొంటారు.
ఇక ఈ చిత్రం టీజర్ ఈ నెల 24 న విడుదల కానుంది. ఈ చిత్రం దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆ రోజు విడుదల చేయాలని నిర్మాత గణేష్ బాబు నిర్ణయించుకున్నారు. శ్రీను వైట్ల కెరీర్ లో భారీ బడ్జెట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని,గబ్బర్ సింగ్ లా ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించాలని గణేష్ సైతం ఎంత ఖర్చైనా ఫరావలేదన్నట్లు ముందుకు వెళ్ళుతున్నట్లు సమాచారం.
ఇక ఈ టీజర్ రిలీజ్ విషయాన్ని రచయిత గోపీ మోహన్ ట్వీట్ ద్వారా తెలియచేసారు. ఆ ట్వీట్ లో...సెప్టెంబర్ 24,మా ఫేవరెట్ డైరక్టర్ శ్రీను వైట్ల పుట్టిన రోజు. ఆ రోజు, మా నిర్మాత బండ్ల గణేష్ గారు 'బాద్ షా'టీజర్ రిలీజ్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసారు. ఈ విషయాన్ని మరో రచయిత కోన వెంకట్ సైతం ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసారు. అలాగే ఈ చిత్రం గురించి గురించి చెప్తూ..బాద్షా బడ్జెట్ అన్ లిమెటెడ్...బాద్షా ఫన్ అన్ లిమెడెట్...ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నారు.
జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











