twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ స్టెప్ కోసం నేను విజయ్ ని కాపీకొట్టాను: ఎన్టీఆర్

    ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు ఎందుకంటే అన్ని రకాల గోడలని దాటి ఇప్పుడు ప్రతీమనిషీ తనని సినిమాలకి అతీతంగా అభిమానించే స్థాయికి వచ్చేసాడు...

    |

    Recommended Video

    NTR copied a Dance step from this Hero ఆ స్టెప్ కోసం నేను కాపీకొట్టాను | Filmibeat Telugu

    తారక్, జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ నిన్నా మొన్నటివరకూ కామన్ "హీరో"గా కనిపిస్తూనే నటుడిగా చాలామందికి నచ్చే వాడీ నందమూరి వారసుడు. నిజానికి తారక్ ని మెచ్చుకుంటూనే కొన్ని మూసపద్దతుల్లో వచ్చిన సినిమాల పట్ల అభిమానుల్లోతప్ప మిగతా వర్గాల్లో కొంత అసంతృప్తి ఉండేది అయితే ఊసరవెల్లి సినిమానుంచీ ఎన్టీఆర్ విశ్వరూపం విస్తరించటం మొదలయ్యింది అక్కడినుంచీ తారక్ వేసిన ప్రతీ అడుగూ వైవిధ్యం వైపే. కేవలం సోకాల్డ్ హీరో అనే ఇమేజ్ నుంచీ, అర్థం లేని ఫాల్స్ ప్రిస్టేజ్ నుంచీ బయటకి వచ్చేసాడు తారక్. ఇక రీసెంట్ ఫంక్షన్ లో అభిమానులని ఉద్దేశించి చెప్పిన మాటలకైతే ప్రతీ హీరో అభిమానీ తారక్ ని చూసి ముచ్చటపడ్డాడు. గతం లో ఈ తరహా ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ పట్ల ఉండేది. ఇప్పుడు ఆ "ఈగో"ల చట్రం నుంచి బయటపడ్డాడు ఎన్టీఆర్.

    తారక్ ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు

    తారక్ ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు

    అంతకు ముందుకూడా బయట పెద్దగా మాట్లాడని మొహమాటం నుంచి కూడా బయటకొచ్చేసి కంప్లీట్ పీపుల్ ఫ్రెండ్లీ అయిపోయిన తారక్ సాటి నటులని మెచ్చుకోవటానికి అడ్డువచ్చే కామన్ ఈగోని కూడా వదిలేసాడు. ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు ఎందుకంటే అన్ని రకాల గోడలని దాటి ఇప్పుడు ప్రతీమనిషీ తనని సినిమాలకి అతీతంగా అభిమానించే స్థాయికి వచ్చేసాడు...

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్

    అది ఈ మధ్యకాలం లో ప్రస్పుటంగా కనిపిస్తోంది. గతం లో ఒకసారి టాలీవుడ్లో తనకు నచ్చిన డ్యాన్సర్ ఎవరంటే.. అల్లు అర్జున్ పేరు ఎన్టీఆర్ చెప్పడం ఆసక్తి రేకెత్తించింది. అసలు ఈగోనేఅదే లేకుందా నేకాదు ఏమాత్రం అందులో "నేను బ్రాడ్ మైండెడ్" అని చెప్పుకోవాలన్న తెచ్చిపెట్టుకున్న తత్వం కూడా కనిపించలేదు నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పేసాడు.

    ప్లేస్ నువ్వు చెప్పినా సరే..

    ప్లేస్ నువ్వు చెప్పినా సరే..

    ఇక మళ్ళీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం గురించి స్పందించమంటే.. తాను ఎవరి గురించీ కామెంట్ చేయలేనంటూనే మంచి జరగాలని కోరుకున్నాడు తారక్. అలాగే బాలయ్య సినిమాల్లో నచ్చిన డైలాగ్ చెప్పమంటే.. ‘నరసింహనాయుడు'లోని ‘ప్లేస్ నువ్వు చెప్పినా సరే..' అనే డైలాగ్ చెప్పి అలరించాడు తారక్.

    సూపర్ స్టార్ రజినీకాంత్

    సూపర్ స్టార్ రజినీకాంత్

    మరోవైపు తమిళ హీరోల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎన్టీఆర్. తమిళంలో మీకు నచ్చిన హీరోలెవరంటే సూపర్ స్టార్ రజినీకాంత్.. అజిత్‌ల పేర్లు ఎన్టీఆర్ చెప్పడం విశేషం. గతంలోనూ రజినీ మీద తన అభిమానాన్ని చాటుకున్న తారక్.. తాజాగా రజినీని మరోసారి ఆకాశానికెత్తేశాడు. రజినీ స్టైల్ గురించి అందరూ మాట్లాడుతుంటారని.. దాని కంటే కూడా తెరమీద ఆయన కనిపిస్తున్నపుడు ప్రేక్షకుల్లో కనిపించే ఉత్సాహం తనకెంతో ఇష్టమని అన్నాడు.

    విజయ్‌ని కాపీ కొట్టి

    విజయ్‌ని కాపీ కొట్టి

    అజిత్ కూడా తనకు చాలా నచ్చుతాడని చెప్పాడు. మరోవైపు విజయ్ గురించి చెబుతూ.. అతడి డ్యాన్స్ తనకు ఇష్టమన్నాడు. తాను ‘కంత్రి' సినిమా కోసం విజయ్‌ని కాపీ కొట్టినట్లు ఎన్టీఆర్ చెప్పడం విశేషం. కంత్రిలో వయస్సునామీ పాటలో ఓ స్టెప్.. విజయ్ నటించిన ‘పోకిరి'లోని ఓ పాట నుంచి తీసుకున్నదని ఎన్టీఆర్ వెల్లడించాడు. విజయ్ వేసిన స్టెప్‌ను తాను అనుకరించానని అన్నాడు.

    English summary
    In a Recent chit chat Tarak said that he copyd a Dance step from Kollywood Hwero Ilayadalapathi Vijay
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X