ఎన్టీఆర్ పొలిటికల్ స్క్రిప్టు

By Staff

Jr Ntr
తెలుగు దేశం పార్టీకు మద్దతుగా రోడ్ షో లు జరపటానికి ఎన్టీఆర్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ 'రోడ్ షొ' గురించి ఎన్టీఆర్‌ తన సన్నిహితులతో చర్చించిన అనంతరం ప్రస్తుతం మంచి రోజులు లేనందున జనవరి నుంచి నిర్వహించాలని నిర్ఛయించుకున్నారని సమాచారం. ఎన్నికలు ఏప్రిల్‌, మేలలో జరిగే పక్షంలో జనవరిలో మొదలుపెట్టి నెలకు నాలుగైదు జిల్లాల చొప్పున కవర్‌ చేయాలన్నది ఆయన నిర్ణయంగా తెలిసింది. ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగేట్లయితే జనవరి, ఫిబ్రవరిల్లోనే అన్ని జిల్లాలు చుట్టేలా ప్రణాళిక రూపొందించాలని సన్నిహితులకు సూచించారు.

రోజుకు అయిదారు నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా పర్యటన రూపొందుతుంది. ఈ విధంగా ప్రతి నెలలో వీలును బట్టి ఎన్ని రోజులు తిరగాలనేది నిర్ణయిద్దామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ పర్యటనల్లో తాత ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈనెలాఖరులో జూనియర్‌ ఎన్టీఆర్‌ తన తాత జన్మస్థలం కృష్ణాజిల్లా నిమ్మకూరుకు వెళ్ళనున్నారు. ఏటా ఒకసారి వెళ్ళి తాత, నాయనమ్మల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.

ఇక ఎన్నికల షెడ్యూలును బట్టి జనవరి నుంచి మొదలు పెట్టి అన్ని జిల్లాలు చుట్టివచ్చేలా ఆయన యాత్ర రూపొందుతుంది. అయితే ఎన్టీఆర్‌ ప్రచారంలో ఎక్కడా ప్రత్యర్థి పార్టీలపైకాని, నేతలపైకాని విమర్శలు ఉండవంటున్నారు. కేవలం తన తాత స్థాపించిన పార్టీ చరిత్ర గురించి, తాత ఘనత గురించి ఎక్కువగా ప్రస్తావించే అవకాశాలున్నాయి. మామ చంద్రబాబు హయాంలో జరిగిన మంచి పనులను విస్తారంగా చెబుతారు. వివాదాస్పద వ్యాఖ్యల జోలికి పోరాదని ఆయన నిశ్చయించుకున్నారు.

అలాగే కెరీర్‌గ్రాఫ్‌ బాగా పెరుగుతున్న దశలో రాజకీయ వేదికలెక్కి విమర్శలు, ప్రతివిమర్శల వంటి వాటికి తాను పోదలుచుకోలేదని చెప్పారు. తన కెరీర్‌కు ఇబ్బంది రాకుండా పార్టీకి లాభం చేకూరేలా ఎలా చేయాలో మీరే నిర్ణయించండని ఎన్టీఆర్‌ బాబుకు చెప్పినట్లు తెలిసింది. ఎన్టీఆర్‌ తన ప్రచారం విషయంలో బాబాయ్‌ బాలకృష్ణతోను మాట్లాడతానని చెప్పారు. బాలకృష్ణ డిసెంబరు నుంచి రోడ్‌షోల్లో పాల్గొంటారని బాబు ఎన్టీఆర్‌కు తెలిపారు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని బాబు సూచించారని అదే ఫాలో కానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X