సూర్యుడు రాకముందే ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్, కళ్యాణ్ రామ్, బాధతో... (ఫోటోస్)
ఎన్టీ రామారావు 23 వర్దంతిని పురస్కరించుకుని నందమూరి ఫ్యామిలీ, రామారావు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. బాలయ్య, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుహాసిని తదితరులు శుక్రవారం ఉదయమే ఘాట్ వద్దకు చేరుకున్నారు.
అయితే అందరికంటే ముందుగా... ఇంకా సూర్యుడు ఉదయించక ముందే జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. తాతగారికి నివాళులు అర్పించిన అనంతరం కాసేపు అక్కడే కూర్చుని ఆయన జ్ఞాపకాలను తలుచుకుని బాధ పడ్డారు.
సూర్యుడు రాకముందు..
ఉదయం సూర్యుడు రాకముందే... కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. వీరి వెంట సినీ రంగానికి చెందిన వారు, నిర్మాత మహేష్ ఎస్ కొనేరు కూడా ఉన్నారు.

ప్రతి సారి ముగ్గురూ... ఈ సారి ఇద్దరే.. మరింత బాధించే విషయం
ప్రతి సారి తన తండ్రి హరికృష్ణతో కలిసి కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసేవారు. అయితే ఈ సారి హరికృష్ణ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తూ...
జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న దృశ్యం. ఈ సందర్భంగా కొందరు మీడియా వారు మాట్లాడాలని కోరినా.... బాధలో ఉన్న వారు అందుకు ఇష్టపడలేదు.

ప్రతి ఒక్కరినీ కదిలించిన దృశ్యం
ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఇద్దరు అన్నదమ్ములూ బాధతో అక్కడే కొంతసేపు కూర్చుండి పోయారు. తండ్రి లేక పోవడంతో ఈసారి వారిలో రెట్టింపు వేదన కనిపించింది.


Click it and Unblock the Notifications











