పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా.... ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం (వీడియో)

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూవీ ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

By Bojja Kumar

Recommended Video

పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా...ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎన్టీఆర్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ(చిన బాబు) నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది, దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్‌కు అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే.

ఫ్యామిలీతో హాజరైన యంగ్ టైగర్

ఫ్యామిలీతో హాజరైన యంగ్ టైగర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి భార్య ప్రణతి, కుమారుడుతో కలిసి హాజరయ్యారు. చిత్ర యూనిట్ వీరికి సాదర స్వాగతం పలికారు.

చీఫ్ గెస్టుగా హాజరైన పవన్ కళ్యాణ్

చీఫ్ గెస్టుగా హాజరైన పవన్ కళ్యాణ్

ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

క్లాప్ కొట్టిన్ పవన్ కళ్యాణ్

క్లాప్ కొట్టిన్ పవన్ కళ్యాణ్

ఎన్టీఆర్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు.

ఎన్టీఆర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన

ఎన్టీఆర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన

సినిమా ప్రారంభోత్సవం ముగిసిన అనంతరం ఎన్టీఆర్‌కు పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

జై పవర్ స్టార్ అంటూ నినాదాలు

జై పవర్ స్టార్ అంటూ నినాదాలు

పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత పవర్ స్టార్ వెలుతున్న సమయంలో అక్కడున్న పలువురు అభిమానులు జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు.

జై ఎన్టీఆర్ అంటూ హోరెత్తించిన ఫ్యాన్స్

జై ఎన్టీఆర్ అంటూ హోరెత్తించిన ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లిన అనంతరం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లి పోయారు. ఎన్టీఆర్ వెలుతుంటే అభిమానులు జై ఎన్టీఆర్ నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ తొలి మూవీ

ఎన్టీఆర్-త్రివిక్రమ్ తొలి మూవీ

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి మూవీ. అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ వరుస సక్సెస్‌లతో మంచి జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అనిరుధ్ రవిచందర్

అనిరుధ్ రవిచందర్

త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు... ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు కూడా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇందుకోసం ట్యూన్లు సిద్ధం చేస్తున్నట్లు అనిరుధ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

యాక్షన్ సినిమానా?

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ యాక్షన్ మూవీ అని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గడంతో పాటు ఫిజిక్ పరంగా పలు మార్పులు చేయబోతున్నాడని సమాచారం. అలాగే మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ తీసుకోబోతున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X