జూ ఎన్టీఆర్ అదుర్స్ రిలీజ్ డేట్ మళ్లీ ఛేంజ్
వివి వినాయిక్,ఎన్టీఆర్ కాంబినేషన్లో రెడీ అయిన అదుర్స్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జనవరి ఎనిమిదవ తేదీనే ఈ చిత్రం రిలీజ్ చేయాలని తర్జన భర్జనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే లేటయి నష్టపోయాం..పండగకు ఓ మూడు రోజులు ముందు రిలీజ్ చేస్తే పండుగ కలెక్షన్స్ తో పాటు ఆ మూడు రోజుల కలెక్షన్స్ కూడా బోనస్ గా కలుస్తాయని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా నయనతార, షీలా కనపడనున్నారు. ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కోనవెంకట్ కథ,మాటలు అందించిన ఈ చిత్రం పూర్తి కామిడిగా తీర్చిదిద్దారని తెలుస్తోంది.
జూ ఎన్టీఆర్ అదుర్స్ నయనతార షీలా వివి వినాయిక్ సాంబ ఆది బృందావనం వల్లభనేని వంశీ jr ntr adurs nayantara sheela vv vinayak sambha aadi brundavanam


Click it and Unblock the Notifications