‘అరవింద సమేత’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ రికార్డుపై కన్నేసిన ఎన్టీఆర్!
జై లవకుశ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో బ్లాక్‌బస్టర్‌పై గురిపెట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత. వీర రాఘవ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ చిత్ర యూనిట్ ఇచ్చినట్టు తెలిసింది.

మాస్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్
ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

అక్టోబర్ 10న అరవింద సమేత రిలీజ్
దసరా కానుకగా అరవింద సమేత సినిమాను రిలీజ్‌కు సిద్దం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీని రిలీజ డేట్‌గా ఫిక్స్ చేశారట. దసరా బరిలో దూకి మరో హిట్టును సొంతం చేసుకోవాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు సమాచారం.

ఇండస్ట్రీ రికార్డుపై దృష్టి
దసరా పండుగ పురస్కరించుకొని అక్టోబర్ 8వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. లాంగ్ వీకెండ్‌లో భారీగా కలెక్షన్లను కుమ్మేసిందుకు పథకం రచించినట్టు సమాచారం. జై లవకుశతో మంచి కలెక్షన్లు సాధించిన ఎన్టీఆర్ ఇక ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే దిశగా అడుగులేస్తున్నాడు.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న యంగ్ టైగర్ ఈ చిత్రంలో సిక్స్‌ప్యాక్ బాడీతో అలరించనున్నారు. ఎన్టీఆర్ సరసన అందాల తార పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారికా, హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











