జూనియర్ ‘బాద్ షా’కు బాలయ్యే చీఫ్ గెస్టా?
జూనియర్ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమాకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. 'బాద్ షా'అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈచిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాజల్ ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రం రేపు(మార్చి 18)న ప్రారంభం కానుంది. యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రారంభోత్సవానికి పరిశ్రమలోని కొందరు ప్రముఖులు మాత్రమే హాజరువుతున్నారని, నందమూరి బాలకృష్ణను చీఫ్ గెస్ట్ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
'దూకుడు' విజయంతో మంచి జోరుమీదున్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'దమ్ము' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











