twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాద్‌షా'లో ఎన్టీఆర్‌ కొత్తకోణం

    By Srikanya
    |

    హైదరాబాద్: 'యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. వినోదాంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఎన్టీఆర్‌ని కొత్తకోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. 'బాద్‌షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది..' అని సాగే ఫస్ట్‌లుక్‌కి చక్కటి స్పందన లభించింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది''అన్నారు నిర్మాత బండ్ల గణేష్ .

    ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ హీరోయిన్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హీరోయిన్ ఇంటికి సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇతర తారాగణం కూడా పాల్గొంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ హావభావాలు భిన్నంగా ఉంటాయని సమాచారం. ఆయన గెటప్‌ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

    దర్శకుడు శ్రీను వైట్ల చిత్రం మాటల్లో... 'చదరంగంలో గెలవాలంటే ఒకే ఒక మార్గం. తెలివైన ఎత్తులు వేయాలి. ప్రత్యర్థి ఎత్తుల్ని కూడా మనమే వేసేస్తే... ఇంకా సులభంగా గెలవొచ్చు. బాద్‌షాతో పెట్టుకొంటే అంతే! అతనితో ఆటైనా, యుద్ధమైనా ఒక వైపు నుంచే. ఎందుకంటే బాద్‌షా డిసైడైతే సంగ్రామం ఏక పక్షమే. ఆ పోరు ఎలా ఉంటుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే' అన్నారు.

    ''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ ...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

    English summary
    
 'Baadshah' shooting is currently under progress in Hyderabad. Kajal Agarwal is the leading lady opposite to NTR in 'Baadshah'. Seenu Vailta is directing this action and comedy entertainer while SS Thaman is composing the songs. Bandla Ganesh is producing 'Baadshah' under Sri Parameswara Arts banner and the film is scheduled to be released on March 26, 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X