twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెంట్రల్‌ జైల్‌ లోఎన్టీఆర్‌ 'బాద్‌షా'

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'బాద్‌షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ఎన్టీఆర్ 'బాద్‌షా' ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలకమైన సీన్స్ ని ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోని సెంట్రల్‌ జైల్‌ సెట్లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఈ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ శైలికి తగిన కథ ఇది. యాక్షన్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్టీఆర్‌ పాత్రని తెరపై ఆవిష్కరించే విధానం కొత్తగా ఉంటుంది. అనే సంభాషణలు అభిమానుల్ని ఆకట్టుకొంటాయి. జనవరిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

    ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ ...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

    అలాగే కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. వీటిని తప్పకుండా రీచ్ అవుతామంటూ ''ఎన్టీఆర్‌ సినిమాల నుంచి యాక్షన్‌నీ, శ్రీను వైట్ల సినిమాల నుంచి వినోదాన్నీ ఆశిస్తారు. ఇవి రెండూ కలగలిపిన సినిమా ఇది. ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నాము. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది''అన్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు.

    ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.

    English summary
    
 Jr.NTR upcoming movie’ Baadshah ‘ directed by Srinu Vaitla and produced by Bandla Ganesh is fast progressing and currently the shooting is taking place in Ramoji Film city. Actress Kajal is playing female lead role in the movie. The music is scored by SS Thaman. The movie is going to be released in January 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X