ఎన్టీఆర్ హీరోయిజాన్ని పతాక స్ధాయిలో చూపిస్తున్నాం
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ సాగుతోంది. హీరోయిన్ తోపాటు ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్ తదితరులపై వినోద ప్రధానమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు. ఎన్టీఆర్ పూర్తి కాన్పిడెంట్ గా హిట్ కొడతానని చెప్తున్న ఈ చిత్రం టీజర్ ని ఈ నెల 24న 'బాద్‌షా' విడుదల చేస్తారు.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ''ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ రంగరించిన కథ ఇది. ఆయన నటన, గెటప్స్ ఆకట్టుకొంటాయి. హీరోయిజాన్ని పతాక స్థాయిలో చూపిస్తున్నారు దర్శకుడు. ఇటీవలే విదేశాల్లో పోరాట ఘట్టాల్నీ, సన్నివేశాల్ని చిత్రించాుర. అవి చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్.
అలాగే ''ఎన్టీఆర్ సినిమాల నుంచి యాక్షన్‌నీ, శ్రీను వైట్ల సినిమాల నుంచి వినోదాన్నీ ఆశిస్తారు. ఇవి రెండూ కలగలిపిన సినిమా ఇది. ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరిస్తాము''అన్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో...ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు.
ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











