twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాద్‌షా’రిలీజ్ డేట్ ఖరారు చేసిన నిర్మాత

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం విడుదలపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దాంతో అభిమానుల్లో కన్ఫూజన్ తొలిగించేందుకు గణేష్ తన ట్విట్టర్ లో ఈ చిత్రం విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు. ఆ ట్వీట్ లో... " శ్రీను వైట్ల చిత్రం బాద్షా చిత్రం మార్చి 26 న భారీగా విడుదల అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రం అవుట్ పుట్ విషయమై నేను చాలా ఆనందంగా ఉన్నాను. " అని పోస్ట్ చేసారు.

    'బాద్‌షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ఎన్టీఆర్ 'బాద్‌షా' ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలకమైన సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఈ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ శైలికి తగిన కథ ఇది. యాక్షన్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్టీఆర్‌ పాత్రని తెరపై ఆవిష్కరించే విధానం కొత్తగా ఉంటుంది. అనే సంభాషణలు అభిమానుల్ని ఆకట్టుకొంటాయి. '' అన్నారు.

    హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో 'బాద్‌షా' చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్.

    ''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు.

    ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ ...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

    English summary
    "BAADSHAH will be on screens on 28 march. A sreenuvaitla film, It will be a biggest film in NTRs career. I am very happy about the output." (sic), posted Bandla Ganesh. Kajal Agarwal is playing NTR's love interest for the second time in this film after Brindavanam (2010). SS Thaman is composing the music while Kona Venkat and Gopi Mohan are providing the script. Director Sreenu Vaitla is currently filming action sequences on NTR and other support cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X