ఎన్టీఆర్ 'బాద్ షా' లేటెస్ట్ ఇన్ఫో...
ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో 'బాద్ షా'అనే చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని దూకుడు తరహాలోనో ఫారిన్ షెడ్యూల్ తో అంటే ఇటిలీలో ప్రారంభించారు. ప్రస్తుతం మిలాన్ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ కాజల్,ఎన్టీఆర్ మధ్య వచ్చే కీలకమైన సన్నివేసాలు,రెండు పాటులు షూట్ చేస్తున్నారు. ఈ స్టైలిష్ కామిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ ట్రెండీ లుక్ తో కనపడనున్నారు. అక్కడే ముప్పై రోజులు పాటు షూటింగ్ జరపనున్నారు.
నిర్మాత గణేష్ భారీగా ఈ చిత్రం కోసం ఖర్చు పెడుతూ దేనీకీ వెనుతీయటం లేదు. ఇప్పటివరకూ ఏ చిత్రం షూటింగ్ జరగని ప్రదేశంలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెరపై ఆ దృశ్యాలు చాలా అద్బుతంగా వచ్చేలా కనపిస్తాయని అంటున్నారు. రచయితలు కోనవెంకట్,గోపీ మోహన్ జూలై 18 నుంచి అక్కడే ఉండి స్క్రిప్టులో మరిన్ని మార్పులు,చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ అనంతరం హైదరాబాద్ లో కొన్ని సీన్స్ తీసి తర్వాత మళ్లీ బ్యాంకాక్ వెళ్లి అక్కడ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











