ఎన్టీఆర్ బయోపిక్: సింగిల్ వర్డ్‌తో అందరి నోటికి తాళం వేసిన తేజ.. ఏమన్నారంటే?

Recommended Video

Director Teja Talks About NTR BioPic | Filmibeat Telugu

బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోయినా సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

వాస్తవానికి ఈ చిత్రం తొలుత తేజ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామకృష్ణ స్టూడియోస్‌లో జరిగిన ప్రారంభోత్సవానికి అప్పట్లో ఉపరాష్ట్రప్రతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో క్రిష్ ఆ బాధ్యతలు చేపట్టారు.

బయోపిక్ విషయంలో వివాదాలకు దూరంగా తేజ

బయోపిక్ విషయంలో వివాదాలకు దూరంగా తేజ

ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత తేజ వివాదాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయలేమోననే భయంతోనే తప్పుకున్నట్లు వెల్లడించి సైలెంట్ తన దారి తాను చూసుకున్నారు.

రిలీజ్ తర్వాత మీడియాకు కనిపించని తేజ

రిలీజ్ తర్వాత మీడియాకు కనిపించని తేజ

అయితే సంక్రాంతికి ‘ఎన్టీఆర్-కథానాయకుడు' విడుదలైన తర్వాత ఈ సినిమాపై తేజ అభిప్రాయం తెలుసుకోవాలని మీడియా వారు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే తన తాజా చిత్రం ‘సీత' ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా తేజ మీడియా ప్రతినిధులకు ఎదురు పడ్డారు.

సింగిల్ వర్డ్‌తో అందరి నోటికి తాళం

సింగిల్ వర్డ్‌తో అందరి నోటికి తాళం

‘ఎన్టీఆర్-కథానాయకుడు'పై తేజ ఎలా రియాక్ట్ అవుతారో అంటూ ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. బిజీగా ఉండటం వల్ల తాను సినిమా ఇంకా చూడలేదని, ఒక వేళ చూసి ఉంటే మాట్లాడేవాన్ని అంటూ... తెలివిగా అందరి నోటికి తాళం వేశారు.

అది దర్శకుడిపైనే...

అది దర్శకుడిపైనే...

సినిమాలో డ్రామా తగ్గిందనే విమర్శలకు వస్తున్నాయనే ప్రశ్నపై స్పందిస్తూ... అది దర్శకుడిపై ఆధార పడి ఉంటుందని, తాను సినిమా చూడలేదు కాబట్టి ఏమీ మాట్లాడలేనని తేజ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. మరి అప్పటివరకైనా తేజ తన చేతి నుంచి జారిపోయిన ఈ బయోపిక్ చూస్తారో? లేదో?

తేజ దర్శకత్వంలో ‘సీత'

తేజ దర్శకత్వంలో ‘సీత'

తేజ దర్శకత్వంలో ప్రస్తుతం 'సీత' అనే చిత్రం తెరకెక్కుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ మూవీని ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X