ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘మహా ఘనుడు’
హైదరాబాద్: మహా నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కబోతోంది. జె.కె.మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ క్రిష్ట సమర్పణలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'మహా ఘనుడు' టైటిల్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు డి. అనిల్ సుధాకర్, ఎన్.బి. చౌదరి, కృష్ణరావు తెలిపారు. ఈ చిత్రానికి డి కుమార్ రాజేంద్ర దర్శకత్వం వహించబోతున్నారు.
ఏ విధమైన విమర్శలు, వివాదాలు లేకుండా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తి కరంగా నిర్మించడమే కాకుండా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక తరహా చిత్రంగా గుర్తింపు పొందేలా రూపొందిస్తున్నామని వారు తెలిపారు. ఈ చిత్రంలో నటించే తారాగణం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విరాళంగా నారా చంద్రబాబు నాయుడికి అందజేస్తామని తెలిపారు. ఈ చిత్రానకి ఛాయాగ్రహణం: మురళి, ఎడిటింగ్: బద్రి, మాటలు, పాటలు: అంచుల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ క్రిష్ణ, కో డైరెక్టర్స్: పవన్ సాయి, అంచుల నాగేశ్వరరావు, జై, సంగీతం: ఉదయ్ ముద్గల్, నిర్మాతలు: డి. అనిల్ సుధాకర్, ఎన్.బి. చౌదరి, కృష్ణరావు, దర్శకత్వం: డి కుమార్ రాజేంద్ర.


Click it and Unblock the Notifications











