twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ‘బృందావనం’హిందీ రీమేక్,డిటేల్స్

    By Srikanya
    |

    ముంబై: జూ.ఎన్టీఆర్,వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం బృందావనం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలోకి రీమేక్ అవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్రను సంజయ్ దత్ పోషించనున్నారు. ఎన్టీఆర్ పాత్రను రణబీర్ కపూర్ పోషించే అవకాసం ఉంది. హీరోయిన్స్ ఎంపిక ఇంకా జరుగుతోంది. దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. దిల్ రాజు ఈ చిత్రాన్ని మంచి రేటుకే అమ్మినట్లు తెలుస్తోంది.

    ఇక ఈ విషయమై దర్శకుడు వంశీ పైడపల్లి మాట్లాడుతూ...బృందావనం హిందీకు అడిగారు. సంజయ్ దత్,రణబీర్ కపూర్ కీ రోల్స్ లో చేస్తున్నట్లు తెలిసింది. అలాగే నేను ఈ రీమేక్ డైరక్ట్ చేయటం లేదు అని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బృందావనం'. తెలుగులో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళంలోనూ రీమేక్ కానుంది. ప్రముఖ స్టార్ హీరో, రాజకీయవేత్త విజయ్‌కాంత్ ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కుల్ని పొందారు.

    విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్‌ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్‌కాంత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళ స్టార్ డైరక్టర్ ఒకరికి ఈ రీమేక్‌కు భాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. తెలుగులో హీరోయిన్స్ గా నటించిన సమంతా, కాజల్ స్థానంలో ఎవరు నటిస్తారనే విషయం ఇంకా నిర్ణయం కాలేదు. ఇక జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన బృందావనం చిత్రం ఇక్కడ మంచి విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తమిళ రీమేక్ రైట్స్ కోసం చాలా మంది నిర్మాతలు ట్రై చేసినట్లు సమాచారం.

    ఇక గత కొంతకాలంగా తెలుగు చిత్రాల రీమేక్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. హిందీ,తమిళ భాషలవారు ఎప్పటికప్పుడు ఇక్కడ చిత్రాలను రీమేక్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. హిందీలో పోకిరి రీమేక్ హిట్టైన దగ్గర నుంచి వారు ఇక్కడ రిలీజయ్యే చిత్రాల పై ఓ కన్నేసి ఉంచుతున్నారు. తమిళ హీరోలైతే ఇక్కడ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ రోజున ఎంక్వైరీ చేసుకుంటున్నారు. హిట్ టాక్ వస్తే వెంటనే తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన హీరోల చిత్రాలు అక్కడ ఒకేసారి రిలీజవుతున్న నేపధ్యంలో రీమేక్స్ తగ్గే అవకాశం ఉంది.

    English summary
    “Brindavanam has to be tweaked a bit in Hindi. I heard that Sanjay Dutt is playing Prakash Raj’s role and Ranbir or any young actor could do Jr NTR’s role,” says director Vamsi Paidipally who has declined to direct the Hindi remake of Brindavanam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X