'దమ్ము' ఆడియో విడుదల విశేషాలు
ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన చిత్రం 'దమ్ము'. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత. కె.ఎస్.రామారావు సమర్పకులు. ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు సమకూర్చారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని కీరవాణి-వల్లి దంపతులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీప్రణతితో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ...నా గుండెల్లో నిలిచి ఉన్న మన దైవం ఎన్టీఆర్‌కి పాదాభివందనం చేస్తున్నాను. అభిమానుల రుణం వంద జన్మలెత్తినా తీర్చుకోలేను. వారిని, నా కన్న తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోలేను అని ఉద్వేగంగా అన్నారు.
సంగీత దర్సకుడు కీరవాణి మాట్లాడుతూ ''దమ్ము'తో ప్రేక్షకుల మనసుల్ని పాలించే రూలర్‌గా ఎన్టీఆర్ నిలుస్తారు. మీ అందరికంటే ఎన్టీఆర్‌కి వీరాభిమాని మా అబ్బాయి భైరవ. తను కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు''అన్నారు. ''ప్రేక్షకుల అభిమానాన్ని నిలబెట్టేందుకు ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేశాను. కీరవాణి చక్కటి స్వరాలు ఇచ్చారి''అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, త్రిష, కార్తీక, మల్లు భట్టి విక్రమార్క, అలీ, కోట శ్రీనివాసరావు, ఆర్ధర్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు. వేల్ రికార్డ్స్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











