ఎన్టీఆర్ 'దమ్ము' హైలెట్స్ ఇవే..

రాఖీ రేంజిలో సిస్టర్ సెంటిమెంట్ పండుతుందని చెప్తున్నారు. వీటికి అదనపు బలం ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం. యమదొంగ,సింహాద్రి తరహాలో ఈ చిత్రంలో పాటలన్నీ మ్యూజికల్ హిట్స్ అవ్వటమే కాక సినిమా సీన్స్ కు బలం చేకూరుస్తాయని చెప్తున్నారు. చివరగా అపజయమెరగని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణను సింహా చిత్రంతో మరోసారి హిట్ పధంలో నడిపించిన ఘనత బోయపాటికే దక్కింది. ఈ చిత్రంతో తను యంగ్ హీరోల చిత్రాలను డైరక్ట్ చేసే కంటిన్యూ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాడు..అందుకు తగిన కృషి చిత్రంలో కనిపిస్తుందని చెప్తున్నారు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











