ఎన్టీఆర్ ఘాట్ వద్ద..... బాలయ్య, జూనియర్, కళ్యాణ్ రామ్ (ఫోటోస్)
Recommended Video

మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు నందమూరి తారక రామారావు 22 వర్థంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు భారీగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ వారసులైన కొడుకు హరికృష్ణ, బలకృష్ణ మనవళ్లు కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు ఘాట్ ను సందర్శించారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య
గురువారం ఉదయం ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఘాట్ ను సందర్శిచిన నివాళులు అర్పించారు.

ఫ్యామిలీ
నందమూరి తారక రామారావు 22 వర్థంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు భారీగా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు.

తండ్రి బయోపిక్ తీస్తున్న బాలయ్య
ఎన్టీఆర్ గురించి, ఆయన గొప్ప తనం గురించి భావితరాలకు తెలిసేలా తన తండ్రి జీవితంపై బయోపిక్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

ఎన్టీఆర్ మనవళ్లు
తాతయ్య 22 వర్ధంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్న మనవళ్లు జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.

మహానుభావుడు
తాతయ్య భౌతికంగా లేక పోయినా ఆయన ఆత్మ తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలో ఎప్పుడూ ఉంటుందని జూ ఎన్టీఆర్ తరచూ చెబుతుంటారు.

తెలుగు జాతి గర్వించే వ్యక్తి
ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి. నటుడిగా, ముఖ్య మంత్రిగా ఆయన తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేశారు. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తేవడానికి ఎంతో కృషి చేశారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద దృశ్యాలు
ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు భారీగా చేరుకున్నారు.

తాతయ్య జ్ఞాపకాలతో
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతయ్య జ్ఞాపకాల్లో మునిగి పోయిన యంగ్ టైగర్.

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు ప్రతి ఒక్కరూ ఘాట్ ను సందర్శించారు.


Click it and Unblock the Notifications











