జూ ఎన్టీఆర్ ‘దమ్ము’కు 5వ స్థానం
మన రాష్ట్రంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రసాద్ మల్టీప్లెక్ష్ కూడా ఒకటి. ఈ థియేటర్లో సినిమా తొలిరోజు షో రికార్డుల విషయంలో జూ ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రానికి 5వ స్థానం దక్కింది. ఈ విషయంలో మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మేన్' చిత్రం తొలిరోజు 33 షోలు ప్రదర్శింపబడి తొలిస్థానంలో ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'తీన్ మార్, పంజా' చిత్రాలు 30 షోలతో 2వ స్థానంలో ఉండగా... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం 29 షోలతో 3వ స్థానంలో నిలిచింది. మహేష్ బాబు నటించిన 'దూకుడు' చిత్రం 27 షోలతో 4వ స్థానంలో, తాజాగా యంగ్ టైగర్ 'దమ్ము' చిత్రం 24 షోలతో 5వ స్థానంలో నిలిచింది.
జూ ఎన్టీఆర్, త్రిష, కార్తీక హీరో హీరోయిన్లుగా బోయపాటి దర్శకత్వం వహించిన 'దమ్ము' చిత్రం ఈ రోజు 1200 పైచిలుకు తియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి షోలోనే ఈచిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈచిత్రంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ యాక్టింగ్ అందిరిందని ప్రతిఒక్కరూ చెబుతున్న మాట.
వేణు, కోట శ్రీనివాసరావు, సుమన్, నాజర్, కిశోర్, సంపత్, శ్రీధర్‌రెడ్డి, చలపతిరావు, భానుప్రియ, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రచన: ఎమ్.రత్నం, పాటలు: చంద్రబోస్, కెమెరా: ఆర్థర్ విల్సన్, సంగీతం: కీరవాణి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.


Click it and Unblock the Notifications











