ఎన్టీఆర్ వాయిస్‌తో.... వర్మ మరో సంచలనం, నమ్మకపోతే నరకానికే!

'సాక్షాత్తూ ఎన్టీఆర్ గారే నాకు ఈ సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారు.... రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో రిలీజ్ చేశారు.

By Bojja Kumar

'సాక్షాత్తూ ఎన్టీఆర్ గారే నాకు ఈ సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారు. ఇది నమ్మని వాళ్లందరూ కచ్చితంగా నరకానికి పోతారని కూడా చెప్పమన్నారు' అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు.

ఎన్టీఆర్ వాయిస్‌తో కూడిన ఓ వీడియోను వర్మ విడుదల చేశారు. స్వయంగా ఎన్టీ రామారావు చెబుతున్నట్లుగా ఉన్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

వర్మ గురించి ఆ నాడే...

వర్మ గురించి ఆ నాడే...

"రామ్ గోపాల్ వర్మ గారూ... మిత్రులు అక్కినేని నాగేశ్వరరావు గారు పరిచయం చేయగా గతంలో మీరొకసారి మమ్మల్ని కలిశారు. మేము కరచాలనం చేశాం. మీ ప్రతిభను గురించి, మీ మేథస్సును గురించి, మీ ప్రజ్ఞాపాటవాలను గురించి, వ్యక్తిత్వాన్ని గురించి అక్కినేని నాగేశ్వరరావుగారు ఆనాడే నాకు మీ పరోక్షంలో వివరించారు." అంటూ ఎన్టీఆర్ వాయిస్ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.

 మరుగున పడుతున్న నిజాలపై సినిమా ఓ సాహసం

మరుగున పడుతున్న నిజాలపై సినిమా ఓ సాహసం

"నేను ఇలా అశరీరవాణిగా మీకు వినిపించడానికి కారణం మీరు మాపై తీస్తున్న చలనచిత్రం. మరుగునపడబోతున్న చారిత్రక సత్యాలని మరుగున పెడుతున్నవారు బతికుండగానే తెరకు ఎక్కించే ప్రయత్నం చేయడం నిజంగా సాహసం, సాహసం, సాహసం." అంటూ ఎన్టీఆర్ వాయిస్ వర్మను అభినందిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.

 నా అర్థాంగి లక్ష్మికి కూడా తెలియని విషయాలు

నా అర్థాంగి లక్ష్మికి కూడా తెలియని విషయాలు

"మీ సాహసాన్ని ప్రశంసించడంతో పాటు మీకు, ఈలోకానికి, నా అర్థాంగి లక్ష్మికి కూడా తెలియని కొన్ని అతిముఖ్యమైన విషయాలను మీకు చెప్పదలచాను. కార్యక్రమంలో మీరు ఎప్పుడేది అవసరమో మాకే తెలియును గనుక ఆవిషయాలను మేమే ఇలా అశరీరవాణి ద్వారా మీకు మాత్రమే వినిపించి చెబుతాం." అని ఎన్టీఆర్ వాయిస్ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.

 ఇకపై మా ఏకాంత సంభాషణ మీతోనే

ఇకపై మా ఏకాంత సంభాషణ మీతోనే

"మీ చిత్రం వెనుక ఇలా అమరపువీదానంలో అనీర్వచనీయమైన గౌరవవాదనలు అందుకుంటూ.. స్వర్గాధినేతతో సమానమైన మన్ననలను స్వీకరిస్తూ ఉన్న మేమూ ఉన్నామని అందరికీ చెప్పడానికే ఈ ఒక్క పర్యాయం అందరికీ వినిపిస్తున్నాం. ఇకపై మా ఏకాంత సంభాషణ మీతోనే!" అంటూ ఎన్టీఆర్ వాయిస్ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.

వీడియో ఇదే

ఎన్టీఆర్ వాయిస్‌తో వర్మ విడుదల చేసిన వీడియో ఇద....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X