»   » అంత డబ్బు ఏం చేయాలో అర్థంకాలేదు: తొలి రెమ్యూనరేషన్ పై జూ ఎన్టీర్!

అంత డబ్బు ఏం చేయాలో అర్థంకాలేదు: తొలి రెమ్యూనరేషన్ పై జూ ఎన్టీర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల పైనే... ఈ లిస్టులో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. మరి ఎన్టీఆర్ తన తొలి సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం ఎవరికైనా తెలుసా?....ఆ విషయం వింటే మీరూ ఆశ్చర్య పోతారు.

ఎన్టీఆర్ హీరోగా చేసిన తొలి సినిమా ‘నిను చూడాలని'. ఈ సినిమా వచ్చి పదిహేనేళ్లయింది. విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ రూ. 3.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నారట. అప్పట్లో తెరంగ్రేట హీరో అంత మొత్తం అంటే ఎక్కువే మరి. అప్పట్లో అంత డబ్బు ఏ చేయాలో తారక్ కు అర్థం కాలేదట. చివరకు ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ల మదర్ కి ఇచ్చారు.

NTR's first film Remuneration Rs 3.5 lakhs

ఈ విషయాలన్నీ ఎన్టీఆర్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నిన్ను చూడాలని' సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ ఉషా మయూరి థియేటర్ కి వెళ్లి ప్రేక్షకుల మధ్యలో కూర్చుని ఆ సినిమా చూసారు. తన తొలి సినిమాను తాను తొలిసారి థియేటర్లో చూసినపుడు తారక్ కు తన ఎబిలిటీ మీద తనకే డౌట్ వచ్చింద. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1' సినిమా చూసిన తర్వాతే తనలో కాన్ఫిడెన్స్ పెరిగింది అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది' సినిమా ఎన్టీఆర్ కు స్టార్ డమ్ వచ్చింది. దీని తర్వాత తారక్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘సింహాద్రి' ఎన్టీఆర్ కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో చేరిపోయాడు ఎన్టీఆర్.

English summary
NTR was paid Rs 3.5 lakhs as remuneration for playing the lead in 'Ninnu Chudalani'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu