'నాన్నకు ప్రేమతో' కొత్త పోస్టర్ ఇదిగో
హైదరాబాద్: ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. సంక్రాంతికు ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా ఈ రోజు కొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
Here it is #NannakupremathoBrandNewPoster #NTR25 #SankranthiRelease
Posted by Nannaku Prematho on 9 December 2015
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ,'విజయదశమి కానుకగా విడుదలైన 'నాన్నకు ప్రేమతో..' టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లండన్‌లో 60 రోజులపాటు ఓ భారీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్ జరుగుతోంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











