»   »  ‘నాన్నకు ప్రేమతో’ ఫంక్షన్‌లో సూపర్ సెల్ఫీ (ఫొటో)

‘నాన్నకు ప్రేమతో’ ఫంక్షన్‌లో సూపర్ సెల్ఫీ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' ఆడియో ఘనంగా నిన్న ఆదివారం రాత్రి విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో చిత్ర నిర్మాత బీవీఎస్‌న్‌ ప్రసాద్‌, దర్శకుడు సుకుమార్‌ ఈ వేడుకలో తీసుకున్న సెల్ఫీని నిర్మాణ సంస్థ తన సోషల్‌మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. ఆ ఫొటో మీకోసం...ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ ఆడియో వేడుకకు చిత్ర యూనిట్‌, సినీ ప్రముఖులు, ఎన్టీఆర్‌ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.


Ntr's Nannaku Prematho unit Selfie

అలాగే ఆడియో విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్‌, ఆయన తండ్రి హరికృష్ణ, సోదరుడు కల్యాణ్‌రామ్‌ హాజరయ్యారు. ఎన్టీఆర్‌ రాక సందర్భంగా అభిమానుల కేకలతో హాల్‌ అంతా మార్మోగిపోయింది.


దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.


నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. '' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.


English summary
Ntr 'Nannaku Prematho' unit take a selfie Audio function. The shooting of the film will be wrapped up by December and it will hit the screens on January 8th, 2016.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu