ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' లుక్(ఫోటోలు)- టీజర్
హైదారాబాద్ : మరోసారి ఎన్టీఆర్ వినోదం, యాక్షన్ కలగలిపిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే 'రామయ్యా వస్తావయ్యా'. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. హరీష్ శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత.
సమంత హీరోయిన్. శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో నాయకానాయికలపై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సోమవారం ఎన్టీఆర్ జన్మదినం. ఈ సందర్భంగా ఫోటోలు మీడియాకు విడుదల చేసారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.
ఫోటోలు స్లైడ్ షో లో...

ఎన్టీఆర్ ఈ చిత్రంలో స్టూడెంట్ గా కనిపించనున్నాడని సమాచారం.

ఈ చిత్రం నిమిత్తం వదిలిన ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే అభిమానులకు కిక్కిస్తోంది.

తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: కనల్ కణ్ణన్.



Click it and Unblock the Notifications











